• facebook
  • whatsapp
  • telegram

AFCAT: ఏఎఫ్ క్యాట్‌-2021 అడ్మిట్ కార్డులు విడుద‌ల‌

 

ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ నిర్వ‌హించ‌నున్న ఎయిర్‌ఫోర్స్ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (ఏఎఫ్ క్యాట్‌)-2021 అడ్మిట్ కార్డులు విడుద‌ల‌య్యాయి. అభ్య‌ర్థులు సంబంధిత వెబ్‌సైట్‌లో త‌మ అడ్మిట్ కార్డుల‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఏఎఫ్ క్యాట్ ప‌రీక్షను ఆగ‌స్టు 28, 29, 30 తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు. ఈ ప‌రీక్ష ద్వారా ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌లో 334 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. వీటిలో ఫ్లైయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నిక‌ల్‌)లో 137 ఖాళీలు, గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నిక‌ల్‌)లో 73, ఫ్లైయింగ్‌, మెటియోరాల‌జీ విభాగంలో 28 పోస్ట‌లున్నాయి. వీటిని షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ విధానంలో భ‌ర్తీ చేస్తున్నారు. 

వెబ్‌సైట్‌: https://afcat.cdac.in/

 

Posted Date : 21-08-2021