• facebook
  • whatsapp
  • telegram

HOTEL MANAGEMENT: హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులకు దరఖాస్తులు  

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే : కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ, అప్లైడ్‌ న్యూట్రిషియన్‌ కళాశాల(తిరుపతి)లో 2021-22 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్‌ వి.గిరిబాబు అన్నారు. శనివారం మొగల్రాజపురంలోని ఓ హోటల్లో ఆయన మాట్లాడుతూ బీఎస్సీ (హెచ్‌అండ్‌హెచ్‌ఎ) మూడేళ్ల డిగ్రీ కోర్సుకు ఇంటర్మీడియట్‌లో 50 శాతంపైన మార్కులు సాధించిన వారు అర్హులన్నారు. సర్టిఫికెట్‌ ఇన్‌ ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌ సర్వీస్‌ కోర్సుకు ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణులై 25 ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. మరిన్ని వివరాలకు 9700440604, 9700734601, 9701343846 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. www.sihmtpt.org వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్‌ చేసుకుని, సెప్టెంబరు ఆరో తేదీ లోపు పంపించాలని చెప్పారు. సమావేశంలో కళాశాల ప్రవేశాల కన్వీనర్‌ కె.శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


 

Posted Date : 22-08-2021