• facebook
  • whatsapp
  • telegram

తప్పుగా ‘టైప్‌’ పేపర్‌..  విద్యార్థుల అయోమయం  

కార్వాన్, న్యూస్‌టుడే: తెలంగాణ‌ రాష్ట్ర వ్యాప్తంగా ఆగ‌స్టు 22న‌ జరిగిన లోయర్‌ టైప్‌ రైటింగ్‌ పరీక్షలో రెండో ప్రశ్నపత్రంలో హయ్యర్‌కు సంబంధించిన ప్రశ్న ఇచ్చారని మాసాబ్‌ట్యాంక్‌ పాలిటెక్నిక్‌లో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. 100 మార్కుల పేపర్‌లో 40 మార్కుల ప్రశ్న తప్పుగా వచ్చిందని వాపోయారు. మరో ప్రశ్నపత్రం ఇచ్చినా.. అప్పటికే సమయం మించిపోయిందని ఆవేదన చెందారు. అదనపు సమయం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కళాశాల ప్రిన్సిపల్‌ డా.ఎన్‌.రాజేశ్వరిదేవిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. బోర్డు నుంచి వచ్చిన పేపర్లతోనే పరీక్షలు నిర్వహించామని తెలిపారు. విద్యార్థులు నష్టపోకుండా బోర్డు తగు నిర్ణయం తీసుకుంటుందని సాంకేతిక విద్యామండలి కార్యదర్శి శ్రీనాథ్‌ పేర్కొన్నారు.
 

Posted Date : 23-08-2021