• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాల నమోదు గడువు పెంపు

 

ఈనాడు డిజిటల్, అమరావతి: ఇంటర్‌ తొలి దశ ఆన్‌లైన్‌ ప్రవేశాల నమోదు గడువును ఆగస్టు 27 వరకూ పొడిగిస్తున్నట్లు ఇంటర్‌ విద్యా మండలి వెల్లడించింది. 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ నమోదు చేసుకోవచ్చని, విద్యార్థులు, తల్లిదండ్రులకు సందేహాలుంటే 18002749868 టోల్‌ ఫ్రీ నంబరును సంప్రదించాలని ఆగస్టు 23  సూచించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.50, ఓసీ, బీసీ కేటగిరీ విద్యార్థులు రూ.100 చెల్లించాలని స్పష్టం చేసింది. 

 

ఫీజు చెల్లించకుండానే పరీక్షలకు

ఇంటర్‌-2021లో మార్కులు పెంచుకోవాలనుకునే విద్యార్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా పరీక్షలకు హాజరుకావొచ్చని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. ఒకటి కన్నా ఎక్కువ సబ్జెక్టులున్నా ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని, కళాశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని ఆగస్టు 23న తెలిపింది. 

Posted Date : 23-08-2021