• facebook
  • whatsapp
  • telegram

EDCET: ఎడ్‌సెట్‌-2021కు 80 శాతం హాజరు

కేయూ క్యాంపస్, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని రెండేళ్ల బీఈడీలో 2021-22 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం ఆగస్టు 24న జరిగిన ప్రవేశ పరీక్ష (ఎడ్‌సెట్‌-2021)కు ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో 80.07 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 8 కేంద్రాల్లో పరీక్ష మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు. ఇందులో 1,820 మంది దరఖాస్తు చేసుకోగా 1,477 మంది పరీక్షకు హాజరయ్యారని, 353 మంది గైర్హాజరయ్యారని ఎడ్‌సెట్‌ రాష్ట్ర కో-కన్వీనర్‌ డాక్టర్‌ పి.శంకర్‌ తెలిపారు. ఆగస్టు 25న రెండు సెషన్లలో పరీక్ష ఉంటుందన్నారు.

Posted Date : 25-08-2021