• facebook
  • whatsapp
  • telegram

Engineering: ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షకు 94% హాజరు 

ఈనాడు డిజిటల్, అమరావతి: ఏపీఈఏపీసెట్‌-2021లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షకు 1,66,460 మంది హాజరైనట్లు ఏపీ ఉన్నత విద్యామండలి వెల్లడించింది. మొత్తం 1,76,603 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 94.26% హాజరైనట్లు తెలిపింది. ఆగస్టు 19 నుంచి ఆగస్టు 25 వరకు 10 సెషన్లలో పరీక్ష నిర్వహించినట్లు వివరించింది.

Posted Date : 26-08-2021