• facebook
  • whatsapp
  • telegram

Vignan Versity: ఆగస్టు 27, 28 ‘విజ్ఞాన్‌’ స్నాతకోత్సవాలు

పొన్నూరు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా వడ్లమూడి వద్దనున్న ‘విజ్ఞాన్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్సిటీ’లో ఆగస్టు 27, 28 తేదీల్లో స్నాతకోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఉప కులపతి ఎంవైఎస్‌ ప్రసాద్‌ ఆగస్టు 25న తెలిపారు. ఆగస్టు 27న జరిగే ఎనిమిదో స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా యూజీసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ డి.పి.సింగ్, 28న జరిగే తొమ్మిదో స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ముంబయిలోని నాబార్డు ఛైర్మన్‌ చింతల గోవిందరాజులు హాజరవుతారన్నారు. స్నాతకోత్సవాల సందర్భంగా 3,666 మందికి పట్టాలు ప్రదానం చేయనున్నట్టు పేర్కొన్నారు. అంతకుముందు స్నాతకోత్సవాల గోడపత్రికను ఉప కులపతి ఎంవైఎస్‌ ప్రసాద్, రిజిస్ట్రార్‌ ఎంఎస్‌ రఘునాథన్, కన్వీనర్‌ విజయకృష్ణ, కో-కన్వీనర్‌ ఎల్‌.సువర్ణరాజులుఆవిష్కరించారు.

Posted Date : 26-08-2021