• facebook
  • whatsapp
  • telegram

Results: ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ ఫిజియోథెరపీ డిగ్రీ ఫలితాలు విడుదల

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: జులైలో జరిగిన అన్ని ఏడాదుల ఫిజియోథెరపీ డిగ్రీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విశ్వవిద్యాలయ మార్గనిర్దేశకాల మేరకు 5 గ్రేస్‌ మార్కులు కలిపిన తర్వాతే ఫలితాలను విడుదల చేశామని విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. రీటోటలింగ్‌ కోరే అభ్యర్థులు సబ్జెక్టుకు రూ.500 డీడీని రిజిస్ట్రార్‌ పేరిట తీసుకొని ఆగస్టు 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఫలితాలు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు.

http://ntruhs.ap.nic.in/ntruhsresult/results

Posted Date : 26-08-2021