• facebook
  • whatsapp
  • telegram

KU: కేయూ డిగ్రీ ఫలితాలు విడుదల

సుబేదారి, న్యూస్‌టుడే: హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో మొదటి ఏడాది బీఏ, బీకాం, బీఎస్సీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలను ఆగస్టు 26న ప్రిన్సిపల్‌ ఆచార్య టి. మనోహర్‌ కళాశాలలో విడుదల చేశారు. బీఏ, బీకాం, బీఎస్సీలో మొదటి సెమిస్టర్‌కు 927 మంది విద్యార్థులు హాజరు కాగా 580 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. వైస్‌ ప్రిన్సిపల్‌ ఆచార్య స్వర్ణలత, సహాయక రిజిస్ట్రార్‌ కిష్టయ్య, అధ్యాపకులున్నారు.

https://uascku.ac.in/ug-i-year-i-semester-examinations-results/

 

 

Posted Date : 27-08-2021