• facebook
  • whatsapp
  • telegram

KU PG: ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు చర్యలు

కేయూ క్యాంపస్, న్యూస్‌టుడే: సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి పీజీ విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు మొదలవుతాయని కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య టి.రమేష్‌ పేర్కొన్నారు. ఈమేరకు కళాశాలల ప్రధానాచార్యులు, వర్సిటీ అధికారులు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఆగస్టు 26న జరిగిన ప్రిన్సిపాళ్ల సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. తరగతి గదులు, వసతిగృహాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. మార్గదర్శకాల ప్రకారం తరగతులను నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు ఉన్నారు.

Posted Date : 27-08-2021