• facebook
  • whatsapp
  • telegram

11 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తులు

* ప్రకటించిన ఐఐటీ ఖరగ్‌పూర్‌

* 10న జేఈఈ మెయిన్‌ ర్యాంకుల వెల్లడి!

 

 

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ చివరి విడత ఆన్‌లైన్‌ పరీక్షలు సెప్టెంబరు 2వ తేదీ నాటికి ముగియనున్న నేపథ్యంలో ఐఐటీ ఖరగ్‌పూర్‌ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తుల ప్రక్రియ కాల పట్టికను ప్రకటించింది. ఆ ప్రకారం సెప్టెంబరు 11 నుంచి 16వతేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏటా మెయిన్‌ ర్యాంకులు వెల్లడించిన మరుసటి రోజు నుంచి అర్హులు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునేలా కాలపట్టికను ప్రకటిస్తూ వస్తున్నారు. దీన్నిబట్టి జేఈఈ మెయిన్‌ ఫలితాలు సెప్టెంబరు 10వ తేదీన వెల్లడయ్యే అవకాశం ఉంది. మెయిన్‌లో అర్హత పొందిన 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అవకాశం ఉంటుంది. సరాసరిన ఏటా 1.50 లక్షల నుంచి 1.60 లక్షల మందే దరఖాస్తు చేస్తున్నారు.

 

కాలపట్టిక ఇలా

రిజిస్ట్రేషన్‌ ప్రారంభం: సెప్టెంబరు 11వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 16వ తేదీ వరకు

అడ్మిట్‌ కార్డులు (హాల్‌టికెట్‌): 25 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

అడ్వాన్స్‌డ్‌ పరీక్ష: అక్టోబరు 3న

విద్యార్థులు గుర్తించిన జవాబు పత్రం వెబ్‌సైట్లో ఉంచేది: అక్టోబరు 5న

ప్రాథమిక కీ వెల్లడి: అక్టోబరు 10న

ర్యాంకుల ప్రకటన: అక్టోబరు 15న

సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం: అక్టోబరు 16 నుంచి
 

Posted Date : 27-08-2021