• facebook
  • whatsapp
  • telegram

KU Exams: సెప్టెంబరు 6 నుంచి ఎంబీఏ పరీక్షలు

కేయూ క్యాంపస్, న్యూస్‌టుడే: కేయూ రెగ్యులర్‌ ఎంబీఏ ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్‌ పరీక్షలు సెప్టెంబరు 6వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి.మల్లారెడ్డి, అదనపు అధికారిణి డాక్టర్‌ ఎం.సురేఖ ఆగస్టు 27న ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు పరీక్షలు ఉంటాయన్నారు.

ఎంసీఏ..

కేయూ రెగ్యులర్‌ ఎంసీఏ ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్‌ పరీక్షలు సెప్టెంబరు 6, 8, 11, 13, 15, తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. వివరాలను కేయూ వెబ్‌సైట్‌లోపొందుపరిచారు.

నేటి నుంచి ఎంఎస్‌డబ్ల్యూ..

ఎంఎస్‌డబ్ల్యూ ప్రథమ సంవత్సరం వార్షీక పరీక్షలు ఆగస్టు 28 నుంచి ప్రారంభమౌతాయని వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి.మల్లారెడ్డి తెలిపారు. ఆగస్టు 28, 30, సెప్టెంబరు 1, 3, 5 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. 

సెప్టెంబరు ఆరో తేదీ వరకు గడువు 

కేయూ ఐదేళ్ల ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ 9వ సెమిస్టర్‌ విద్యార్థులు పరీక్షల ఫీజు ఆలస్యం రుసుము లేకుండా సెప్టెంబరు 6వ తేదీలోగా చెల్లించాలని కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి.మల్లారెడ్డి, అదనపు అధికారిణి డాక్టర్‌ ఎం.సురేఖ తెలిపారు. రూ.250 ఆలస్య రుసుముతో సెప్టెంబరు 9వ తేదీలోగా చెల్లించవచ్చన్నారు.

Posted Date : 28-08-2021