• facebook
  • whatsapp
  • telegram

Ph.D RCET: పీహెచ్‌డీ ప్రవేశాలకు ఆర్‌సెట్‌

 

ఈనాడు, అమరావతి: పరిశోధన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఆర్‌సెట్‌) ద్వారా పీహెచ్‌డీ ప్రవేశాలు నిర్వహించేందుకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులనిచ్చింది. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) నెట్, సీఎస్‌ఐఆర్, ఎంఫిల్‌ అర్హత ఉన్నవారికి ఒకే ప్రశ్నపత్రంతో పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో రాత పరీక్షకు 70 మార్కులు, మౌఖిక పరీక్షకు 30 మార్కులు ఉంటాయి. కేటగిరి-2 కింద నిర్వహించే పరీక్షలో రెండు ప్రశ్నపత్రాలు ఉంటాయి. రాత పరీక్ష 140, మౌఖిక పరీక్ష 60 మార్కులకు ఉంటుంది.

Posted Date : 28-08-2021