• facebook
  • whatsapp
  • telegram

Nursing: ఎస్సీ నర్సింగ్‌ విద్యార్థినులకు నైపుణ్య శిక్షణ

ఈనాడు, హైదరాబాద్‌: నర్సింగ్‌ విద్యను పూర్తి చేసుకున్న ఎస్సీ విద్యార్థినులకు నైపుణ్య శిక్షణ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా తెలంగాణ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఫర్‌ నర్సెస్‌ ఆధ్వర్యంలో బీఎస్సీ, జీఎన్‌ఎం నర్సింగ్‌ కోర్సులు పూర్తి చేసిన వారికి శిక్షణ అందించనున్నారు. వారు విదేశాలకు వెళ్లేందుకు రాసే ఇంటర్నేషనల్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టెస్టింగ్‌ సిస్టమ్‌(ఐఈఎల్‌టీఎస్‌), ఆక్యుపేషనల్‌ ఇంగ్లిష్‌ టెస్ట్‌(ఓఈటీ) పరీక్షకు 6 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. నర్సింగ్‌ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పనిచేసేలా నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు తర్ఫీదు ఇస్తారు. అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యాలతో పాటు ఉపకారవేతనం అందజేస్తారు. ఆసక్తి గలవారు 6309164343, 6309165353, 6309166262 ఫోన్‌ నంబర్లలో లేదా admissions@tsnursingskills.orgకు ఈమెయిల్‌ ద్వారా లేదా బాటా షోరూం కాంప్లెక్స్‌, 4వ అంతస్తు, పనామా, వనస్థలిపురం, హైదరాబాద్‌ చిరునామాలో నేరుగా సంప్రదించాలని నర్సింగ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కో ఆర్డినేటర్‌ సునీత ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులు సెప్టెంబరు 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Posted Date : 30-08-2021