• facebook
  • whatsapp
  • telegram

Pvt Schools: ప్రైవేటు పాఠశాలల బంద్‌

గవర్నర్‌పేట (విజయవాడ), న్యూస్‌టుడే: ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల మనుగడను దెబ్బతీసేలా ఉన్న జీవో 53ను రద్దు చేయాలని ఫెడరేషన్‌ ఆఫ్‌ అన్‌ ఎయిడెడ్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ ఆంధ్రప్రదేశ్‌ డిమాండ్‌ చేసింది. తమ సమస్యలపై స్పందించాలని కోరుతూ సెప్టెంబరు 4న రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు బంద్‌ నిర్వహించనున్నట్లు తెలిపింది. విజయవాడలో సెప్టెంబరు 3న నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం.వి.రామచంద్రారెడ్డి తదితరులు మాట్లాడుతూ... ‘‘ప్రభుత్వం జారీ చేసిన 53, 54 జీవోలు విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాóు. వీటిని వెంటనే నిలిపేయాల్సిందే. ప్రాంతాల వారీగా ఫీజులు నిర్ణయించడం సరికాదు. ఏడాదికి రూ.10 వేలు, రూ.18 వేలతో నాణ్యమైన విద్యను అందించలేం. పెరిగిన ఖర్చుల దృష్ట్యా ప్రాథమిక పాఠశాలలకు రూ.20 వేలు, ఉన్నత పాఠశాలలకు రూ.30 వేలుగా ఫీజులను నిర్ణయించాలి’’ అని కోరారు. సమావేశంలో అసోసియేషన్‌ ప్రతినిధులు కె.ఎస్‌.ఎన్‌.మూర్తి, మేకల రవీంద్రబాబు, కోగంటి శ్రీకాంత్, పి.ప్రభాకరరెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Posted Date : 04-09-2021