• facebook
  • whatsapp
  • telegram

ఆర్జీయూకేటీలో ప్రవేశానికి 73,941 దరఖాస్తులు

* సెప్టెంబరు 26న ఉమ్మడి ప్రవేశ పరీక్ష

* అక్టోబర్‌ 4న ఫలితాలు

వేంపల్లె, న్యూస్‌టుడే: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో 2020-21 ప్రవేశాలకు సంబందించి వర్సిటీ నిర్వహించనున్న ఆర్జీయూకేటీ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 73,941 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తుల చివరి రోజైన సెప్టెంబరు 6 నాటికి ఈ మేర దరఖాస్తులు వచ్చినట్లు వర్సిటీ కులపతి ఆచార్య కేసీరెడ్డి, పరీక్షల నిర్వహణ కోకన్వీనర్‌ ఆచార్య గోపాలరాజు తెలిపారు. ఈ నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో 4000 సీట్లు ఉన్నాయి. సెప్టెంబరు 26న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. గతేడాది కంటే అధికంగా విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షా ఫలితాల ‘కీ’ అక్టోబర్‌ 2న, తుది ఫలితాలు అక్టోబర్‌ 4వతేదీన వెలువడతాయని తెలిపారు. రూ.1000 అపరాధ రుసుంతో సెప్టెంబరు 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కులపతి తెలియజేశారు. 
 

Posted Date : 07-09-2021