• facebook
  • whatsapp
  • telegram

AP ICET: ఏపీ ఐసెట్‌ దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ఏపీ ఐసెట్‌ - 2021 దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసుకోవడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం అవకాశం కల్పించింది. ఈ మేరకు సెట్‌ కన్వీనర్‌ ఆచార్య జి.శశిభూషణరావు ఒక ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తులో తప్పులు దొర్లినా, అసంపూర్తిగా నింపినా సెప్టెంబరు 8, 9, 10 తేదీల్లో ఆన్‌లైన్‌లో సరిచేసుకోవచ్చన్నారు. దరఖాస్తు పరిశీలన, ఇతర వివరాలకు http://sche.ap.gov.in/icet వెబ్‌సైట్‌లో చూడాలని కోరారు. ఈ పరీక్ష సెప్టెంబరు 17, 18 తేదీల్లో జరగనుంది.

Posted Date : 08-09-2021