• facebook
  • whatsapp
  • telegram

D.Ed: డీఈడీ విద్యార్థులు నష్టపోకుండా సీట్ల కేటాయింపు: కన్వీనర్‌ 

 

ఈనాడు, అమరావతి: డీఈడీ కౌన్సెలింగ్‌లో విద్యా సంవత్సరం నష్టపోకుండా విద్యార్థులకు సీట్లు కేటాయించామని కన్వీనర్‌ రవీంద్రనాథ్‌ తెలిపారు. మొదటి విడత కౌన్సెలింగ్‌ అనంతరం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన 417 కళాశాలల అనుమతులను రద్దు చేశామని వెల్లడించారు. వాటిలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు రెండు, మూడు విడతల కౌన్సెలింగ్‌ ద్వారా కోరుకున్న కళాశాలలో సీట్లను సర్దుబాటు చేశామని తెలిపారు. మూడు విడతల కౌన్సెలింగ్‌ తర్వాత కళాశాలల్లో ఇంకా సీట్ల మిగిలాయని, వాటి భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

Posted Date : 09-09-2021