• facebook
  • whatsapp
  • telegram

BRAOU: అంబేడ్కర్‌ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పొడిగింపు

 

జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ ప్రవేశాలకు గడువు పెంచినట్లు విశ్వవిద్యాలయ అధికారులు సెప్టెంబరు 09న విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీలతోపాటు పీజీలో బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్‌ కోర్సుల్లో చేరడానికి ఆలస్య రుసుం రూ.200తో చివరి తేదీ సెప్టెంబరు 18 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, రుసుం తదితర వివరాలను www.braouonline.in లో పొందవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 7382929570/580 లేదా విశ్వవిద్యాలయ సహాయ కేంద్రాల 040-23680290/291/294/295 లో పొందవచ్చని సూచించారు. 

Posted Date : 09-09-2021