• facebook
  • whatsapp
  • telegram

IIT JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ వాయిదా

దిల్లీ: ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడింది. జేఈఈ మెయిన్ ర్యాంకుల వెల్లడిలో జాప్యం వల్ల.. జేఈఈ అడ్వాన్స్ డ్ ప్రక్రియ వాయిదా వేశారు. సెప్టెంబ‌రు 11న‌ ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ షెడ్యూలులో మార్పులు చేసినట్టు ఐఐటీ ఖరగ్‌పూర్‌ ప్రకటించింది. సెప్టెంబ‌రు 13వ తేదీ మధ్యాహ్నం రిజిస్ట్రేషన్లు మొదలు కానున్నాయి. సెప్టెంబ‌రు 19వ తేదీ సాయంత్రం 5 గంటలకు రిజిస్ట్రేషన్లు ముగియనున్నాయి. ఫీజు చెల్లింపునకు సెప్టెంబ‌రు 20 వ తేదీ సాయంత్రం 5 వరకు అవకాశం ఉంటుంది. అక్టోబర్ 3న పరీక్ష యథాతథంగా జరగనుంది.

జేఈఈ మెయిన్ ఫలితాలు నిన్న విడుదల అవుతాయని అభ్యర్థులు ఎదురు చూశారు. కాగా, సెప్టెంబ‌రు 12న సాయంత్రం లేదా సెప్టెంబ‌రు 13న‌ ఉదయం ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. హరియాణాలో జరిగిన పరీక్షలో అక్రమాలు జరిగినట్టు సీబీఐ తేల్చినందున.. ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థులను పక్కన పెట్టేందుకు.. ఫలితాల విడుదల జాప్యం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఫలితాలపై ఎన్‌టీఏ ఎలాంటి ప్రకటన ఇవ్వక పోవడంపై విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 

ఎల్‌టీఐలో 4500 మంది ఫ్రెషర్లు

 

చరిత్రలో చెరగని చిహ్నాలపై పరిశోధన

Posted Date : 11-09-2021