• facebook
  • whatsapp
  • telegram

APPSC: 28 నుంచి శాఖాపరమైన పరీక్షలు

* రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ 

ఈనాడు, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు సెప్టెంబర్ 28 నుంచి 30వ తేదీ వరకు శాఖాపరమైన పరీక్షలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాట్లు చేస్తోంది. వీటిని రాసేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 13 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. జిల్లా కేంద్రాల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. సెరికల్చర్‌ అసిస్టెంట్, వీఆర్వో గ్రేడ్‌-2, ఫిషరీస్‌ అసిస్టెంట్, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-2, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-5, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-6, విలేజ్‌ సర్వేయర్‌-గ్రేడ్‌-3, వెల్పేర్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌గా పనిచేసే వారికి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సిలబస్‌ను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచారు. జీఓ 602 ప్రకారం సర్వే శాఖ ఉద్యోగులకు మినహా మిగిలిన శాఖల ఉద్యోగులకు అబ్జెక్టివ్‌ తరహాలో ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించబోతున్నారు. సర్వే శాఖ ఉద్యోగులకు మాత్రం ప్రశ్న, జవాబు విధానంలో పరీక్ష జరుగుతుంది. ప్రొబెషనరీ పీరియడ్‌ దృష్టిలో ఉంచుకుని పరీక్షను తక్కువ వ్యవధిలో నిర్వహిస్తున్నారు. సుమారు 40వేల మంది ఈ పరీక్షలు రాస్తారని అంచనా. 28న మూడు పరీక్షలు, 29, 30న రెండు చొప్పున పరీక్షలు జరగనున్నాయి. పుస్తకాలు చూసి రాసే పరీక్షలు కూడా ఇందులో ఉన్నాయి. దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే కమిషన్‌కు పంపాలి. నేరుగా స్వీకరించరు. ఫీజులు, ఇతర వివరాలు కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఉన్నాయి.

Posted Date : 12-09-2021