• facebook
  • whatsapp
  • telegram

RCET: ఆన్‌లైన్‌లో రెండు కేటగిరీలుగా ఆర్‌సెట్‌

ఈనాడు, అమరావతి: పీహెచ్‌డీలో ప్రవేశాలకు పరిశోధన ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఆర్‌సెట్‌)ను ఆన్‌లైన్‌లో రెండు కేటగిరీలుగా నిర్వహిస్తారు. కేటగిరి-1 కింద యూజీసీ-నెట్, సీఎస్‌ఐఆర్‌-నెట్‌ అర్హత సాధించిన వారు, ఎంఫిల్‌ ఉత్తీర్ణులైన వారికి రాత పరీక్ష 70మార్కులు, మౌఖిక పరీక్ష 30మార్కులకు ఉంటుంది. కేటగిరి-2 వారికి 200మార్కులకు పరీక్ష ఉంటుంది. పరిశోధన మెథడాలజీకి 70, సబ్జెక్టుకు 70, మౌఖిక పరీక్షకు 60మార్కులు ఉంటాయి. ఆర్‌సెట్‌ సలహా కమిటీ ఛైర్మన్‌గా ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ వ్యవహరిస్తారు. కనీస అర్హత మార్కులు ఓసీలకు 50%, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 45% ఉంటుంది. కేటగిరి-1కు 25శాతం సీట్లు ఉంటాయి. మొదట వీరికి ప్రవేశాలు నిర్వహిస్తారు. మిగిలిన సీట్లను కేటగిరి-2 అభ్యర్థులతో భర్తీ చేస్తారు.

Posted Date : 14-09-2021