• facebook
  • whatsapp
  • telegram

దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువు పొడిగింపు

 

హైదరాబాద్: తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి (దోస్త్‌) మూడో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువును పొడిగించినట్లు కన్వీనర్ లింబాద్రి వెల్లడించారు. సెప్టెంబరు 20వ తేదీ వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉందని.. 23 వరకు వెబ్‌ అప్షన్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీల్లో చేరేందుకు సెప్టెంబరు 27 నుంచి 30 వరకు గడువు విధించినట్లు చెప్పారు. అక్టోబరు 1 నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. అక్టోబరు 1 నుంచి 3వ తేదీ వరకు ఇంట్రా కాలేజ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియను చేపట్టనున్నట్లు లింబాద్రి వెల్లడించారు.

 

 


మరింత సమాచారం ... మీ కోసం!

బోధనకూ.. పరిశోధనకూ ఒకటే పరీక్ష !

ఉపాధినిచ్చేలా విభిన్న బ్రాంచీల సమ్మేళనం

Posted Date : 15-09-2021