• facebook
  • whatsapp
  • telegram

ఫార్మసీ, లా పరీక్షల రుసుం గడువు 25 

శాతవాహన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో జరగనున్న బీ ఫార్మసీ 4వ సెమిస్టర్, ఎంఫార్మసీ 1, 3వ సెమిస్టర్, ఎల్‌ఎల్‌బీ 4వ సెమిస్టర్‌ పరీక్ష రుసుం వివరాలను ఖరారు చేశారు. ఈ మేరకు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ శ్రీరంగ ప్రసాద్‌ ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబ‌రు 25వరకు పరీక్ష రుసుం చెల్లింపునకు గడువు విధించారు. రూ.300 అపరాధ రుసుంతో సెప్టెంబ‌రు 28 వరకు అవకాశం కల్పించారు.

Posted Date : 16-09-2021