• facebook
  • whatsapp
  • telegram

సీఏ కోర్సు రుసుం మినహాయింపు

కరీంనగర్‌ (గణేశ్‌నగర్‌), న్యూస్‌టుడే: కొవిడ్‌ - 19తో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు సీఏ కోర్సు రుసుం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు జిల్లా సీఏల శాఖ అధ్యక్షుడు ముక్క ఆదిత్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అఖిల భారత సీఏల సంస్థ నిర్ణయిం తీసుకుందని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 2020 నుంచి మార్చి 2023 వరకు ఇది వర్తిస్తుందన్నారు. మరిన్ని వివరాలకు https:///www.icai.org/post/frequently–asked–questions లాగిన్‌ కావాలని సూచించారు.

Posted Date : 16-09-2021