• facebook
  • whatsapp
  • telegram

KU Fees: కేయూ దూర విద్య కోర్సుల్లో ఫీజుల పెంపు

కేయూ క్యాంపస్, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్యాకేంద్రం అందిస్తున్న డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల ఫీజులను పెంచారు. ఈ మేరకు కేయూ దూరవిద్యాకేంద్రం వెబ్‌సైట్‌లో వివరాలను పొందుపరిచారు. ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ, పీజీ కోర్సుల్లో గతం కంటే రూ.1000 పెంచారు. ఇప్పటి వరకు పీజీలో ఏడాదికి రూ.5వేలు ఉండగా ఇక నుంచి రూ.6 వేలు చెల్లించాల్సి ఉంటుంది. డిగ్రీలోని కోర్సుల్లోనూ అదనంగా రూ.1000 పెంచినట్లు పేర్కొన్నారు.

 

 

Posted Date : 17-09-2021