• facebook
  • whatsapp
  • telegram

Admissions: జర్నలిజం కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం 

శాతవాహన విశ్వవిద్యాలయం: ఎస్సారార్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న జర్నలిజం, మాస్‌ కమ్యూనికేషన్‌ సర్టిఫికెట్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.రామకృష్ణ, కోర్సు సమన్వయకర్త డాక్టర్‌ కె.మల్లారెడ్డి తెలిపారు. ఆసక్తి గల వారు సెప్టెంబర్‌ 30లోగా తెలుగు విభాగంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుతో పాటు ఇంటర్‌ మెమో, ఆధార్‌ కార్డు, ఫొటోలను జత చేయాలని సూచించారు.

Posted Date : 19-09-2021