• facebook
  • whatsapp
  • telegram

KU Distance Exams: కేయూ దూరవిద్య పరీక్షలు మరోసారి వాయిదా

కేయూ క్యాంపస్, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని దూరవిద్య డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈ మేరకు వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య పి.మల్లారెడ్డి, అదనపు అధికారి డాక్టర్‌ వై.వెంకయ్య సెప్టెంబరు 19న ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత సెప్టెంబరు 20వ తేదీ నుంచి పరీక్షలు జరుగుతాయని షెడ్యూల్‌ విడుదల చేశారు. తరువాత 22 నుంచి నిర్వహిస్తామని చెప్పారు. అయితే పరీక్ష కేంద్రాల ఎంపిక పూర్తికాకపోవడంతో వాయిదా వేస్తున్నామని, త్వరలోనే పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేస్తామని, విద్యార్థులు గమనించాలని కోరారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

స్పష్టంగా.. సమర్థంగా!  

ఐటీలో జోరుగా నియామకాలు 

Posted Date : 20-09-2021