• facebook
  • whatsapp
  • telegram

Engineering: త్వరలో ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌కు ప్రకటన

ఈనాడు, అమరావతి: ఏపీ ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌కు సెప్టెంబరు 28, 29 తేదీల్లో ప్రకటన విడుదల చేయనున్నారు. ఇంజినీరింగ్‌ కళాశాలల అనుబంధ గుర్తింపు, కళాశాలల తుది జాబితాకు 25 వరకు గడువు విధించారు. జేఎన్‌టీయూల నుంచి కళాశాలల జాబితాలు కన్వీనర్‌కు వచ్చిన తర్వాê ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆమోదం తర్వాత ప్రకటన విడుదలవుతుంది. తొలుత పాలిసెట్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. దీనికి 27న ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

Posted Date : 21-09-2021