• facebook
  • whatsapp
  • telegram

Judge Exams: జడ్జి పరీక్షల నిర్వహణను పరిశీలించిన సీజే  

వట్టిచెరుకూరు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం వింజనంపాడు కిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో సెప్టెంబరు 26న నిర్వహించిన జూనియర్‌ సివిల్‌ జడ్జి నియామక పరీక్షలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ఏకే గోస్వామి పరిశీలించారు. పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు అందుతున్న సౌకర్యాలను స్వయంగా వీక్షించారు. మొత్తం 126 మందికి ఈ కేంద్రాన్ని కేటాయించగా.. 105 మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారని కళాశాల ప్రిన్సిపల్‌ బాబు వివరించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంట జిల్లా జడ్జి జాన్‌ అహ్మద్, డీఎస్పీ జెస్సి ప్రశాంతి ఉన్నారు. 

Posted Date : 26-09-2021