• facebook
  • whatsapp
  • telegram

Aided Schools: ఎయిడెడ్‌ బడుల విలీనం వేగవంతం

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో ఎయిడెడ్‌ పాఠశాలల విలీన ప్రక్రియను విద్యాశాఖ అధికారులు వేగవంతం చేశారు. ఉద్యోగుల్ని వెనక్కి ఇచ్చేందుకు సమ్మతి తెలిపిన ఎయిడెడ్‌ పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బంది సెప్టెంబరు 27న విధుల నుంచి రిలీవ్‌ కావాలని, సెప్టెంబరు 28న జిల్లాల విద్యాశాఖ అధికారుల కార్యాలయాల్లో రిపోర్టు చేయాలని పాఠశాల విద్యా శాఖ ఆదేశాలిచ్చింది. సిబ్బందిని వెనక్కి ఇచ్చేందుకు సమ్మతించిన విద్యాసంస్థలకు మాత్రమే ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం ఎయిడెడ్‌ పాఠశాలల విలీన బాధ్యతలను జిల్లాల విద్యాధికారులకు అప్పగించిన నేపథ్యంలో ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే కర్నూలు, అనంతపురం జిల్లా విద్యాధికారులు కొన్ని ఎయిడెడ్‌ యాజమాన్యాలకు ప్రైవేటుగా మారేందుకు సమ్మతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ పాఠశాలల్లో చదివే విద్యార్థులను స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని మండల, డివిజన్‌ విద్యాధికారులకు సూచించారు. విద్యార్థులు అదే పాఠశాలలో చదివేందుకు అంగీకరిస్తే అక్కడే కొనసాగించేలా చూడాలని స్పష్టం చేశారు.

Posted Date : 27-09-2021