• facebook
  • whatsapp
  • telegram

AU: పీజీ, వృత్తివిద్యా కోర్సుల పరీక్షలు వాయిదా

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే: సెప్టెంబరు 27న జరగాల్సిన పీజీ, వృత్తి విద్యాకోర్సుల పరీక్షలు వాయిదా వేసినట్లు ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య కృష్ణమోహన్‌ తెలిపారు. బీటెక్, బీఆర్క్, బీటెక్‌+ఎంటెక్, ఎమ్మెస్సీ అప్లైడ్‌ కెమిస్ట్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌ అక్టోబరు 6కు వాయిదా వేశారు. అలానే బీఫార్మసీ ప్రథమ సంవత్సరపు మొదటి సెమిస్టర్‌ను అక్టోబరు 8న, ఎమ్మెస్సీ అప్లైడ్‌ కెమిస్ట్రీ (2 సంవత్సరాల కోర్సు) అక్టోబరు 1న, ఎంసీఏ, ఎమ్మెస్సీ(సిఎస్‌) మొదటి సంవత్సరపు మొదటి సెమిస్టర్‌ పరీక్ష అక్టోబరు 4న, ఎంఈడీ రెండో సెమిస్టర్‌ పరీక్ష అక్టోబరు 1న జరుగుతాయని తెలిపారు. సెప్టెంబరు 28న జరగాల్సిన పరీక్షలు షెడ్యూల్డ్‌ ప్రకారం యధావిధిగా కొనసాగుతాయన్నారు.

Posted Date : 27-09-2021