• facebook
  • whatsapp
  • telegram

KU: వాయిదా వేసిన కేయూ పరీక్షలు 29న 

ఎన్జీవోస్‌కాలనీ, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో జరుగుతున్న డిగ్రీ, బీటెక్, ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ పరీక్షలను సెప్టెంబరు 27న భారత్‌ బంద్‌ నేపథ్యంలో వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 27న జరగాల్సిన పరీక్షలను తిరిగి 29న నిర్వహించనున్నట్లు వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి.మల్లారెడ్డి, అదనపు అధికారులు డా.వై.వెంకయ్య, డా.పి.సదానందం సెప్టెంబరు 26న ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి మార్పులేదన్నారు. విద్యార్థులు గమనించాలని అధికారులు సూచించారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ అనువుగా..  ఆన్‌లైన్‌ అభ్యాసం! 

‣ ఉద్యోగ వేటకు పదును ఇలా!

Posted Date : 27-09-2021