• facebook
  • whatsapp
  • telegram

DOST: దోస్త్‌ మూడో విడతలో 73,637 మందికి డిగ్రీ సీట్లు

* అక్టోబరు 5 నుంచి ఇంట్రా కాలేజీ ప్రక్రియ

ఈనాడు, హైదరాబాద్‌: డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ (దోస్త్‌) మూడో విడతలో మరో 73,637 మందికి డిగ్రీ సీట్లు దక్కాయి. సీట్లు పొందిన వారు సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 4 వరకు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని కన్వీనర్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు. ఒకటి, రెండు, మూడో విడతలో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసిన వారు కళాశాలలకు స్వయంగా వెళ్లి అక్టోబరు 4 లోపు రిపోర్ట్‌ చేయాలని, లేకుంటే సీటు రద్దవుతుందని ఆయన సూచించారు. కళాశాలల్లో సీట్లు పొందిన వారు అదే కళాశాలలో ఖాళీగా ఉన్న వేరే కోర్సుల్లో చేరేందుకు అక్టోబరు 5 నుంచి 7వ తేదీ వరకు ఇంట్రా కాలేజీ విధానం కింద వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. వారికి 8వ తేదీన సీట్లు కేటాయిస్తారు. అక్టోబరు 1 నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్‌ విద్యార్థులకు తరగతులు మొదలవుతాయి. 

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

ఏఐ, ఎంఎల్‌ కోర్సులకు ఎందుకు డిమాండ్‌?

అంగ్రూ ఎన్ఆర్‌ఐ కోటా డిగ్రీ ప్రవేశాలు

Posted Date : 27-09-2021