• facebook
  • whatsapp
  • telegram

Degree: డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలపై వ్యాజ్యం

ఈనాడు, అమరావతి: డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్‌ ప్రవేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై సెప్టెంబరు 27న హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలు సమర్పించాలని న్యాయమూర్తి జస్టిస్‌ యూ.దుర్గాప్రసాదరావు ఏపీ ఉన్నత విద్యామండలి, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబరు 29కి వాయిదా వేశారు. కొవిడ్‌ కారణంగా ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసి, విద్యార్థులందరికి మార్కులు కేటాయించినందున.. డిగ్రీలో ఆన్‌లైన్‌ ప్రవేశాలు చట్టవిరుద్ధమంటూ విద్యార్థిని కీర్తన, మరొకరు హైకోర్టులో వ్యాజ్యం వేశారు.

Posted Date : 28-09-2021