• facebook
  • whatsapp
  • telegram

Degree Admissions: నోటిఫికేషన్‌ ఇచ్చాక.. కోటా నిర్దేశించడమా?

డిగ్రీ ప్రవేశాలపై కళాశాలల యాజమాన్యాల ప్రశ్న
ఈనాడు, అమరావతి: డిగ్రీ కోర్సుల్లో ఆన్‌లైన్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ ఇచ్చిన తర్వాత యాజమాన్య కోటా ప్రవేశపెట్టడడంపై కొన్ని కళాశాలల యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇంజినీరింగ్‌లో మాదిరిగానే డిగ్రీలోనూ 30 శాతం యాజమాన్య కోటా అమలుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ కోటాలో చేరే విద్యార్థులకు బోధన రుసుముల చెల్లింపు వర్తించదు. విద్యార్థులే ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ ఇచ్చి, రిజిస్ట్రేషన్‌ ప్రారంభించింది. సాంకేతిక విద్యా కోర్సుల్లో లాగా 30శాతం యాజమాన్య కోటా కేటాయించి, వీటికి కన్వీనర్‌ కోటా ఫీజులపై మూడింతలు వసూలు చేసుకునే వెసులుబాటు యాజమాన్యాలకు కల్పించాలని భావిస్తోంది. ఈ సీట్లను కూడా కన్వీనర్‌ ద్వారానే భర్తీ చేయనున్నారు. అయితే.. నోటిఫికేషన్‌ ఇచ్చాక కోటా ఎలా అమలు చేస్తారని ప్రైవేటు కళాశాలలు ప్రశ్నిస్తున్నాయి.

Posted Date : 28-09-2021