• facebook
  • whatsapp
  • telegram

BRAOU: డా.బీఆర్‌ అంబేడ్కర్‌ దూరవిద్య పీజీ పరీక్షలు వాయిదా

మాచవరం, న్యూస్‌టుడే: మాచవరం ఎస్సారార్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంతీయ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో సెప్టెంబరు 28 నుంచి జరగాల్సిన పీజీ మొదటి సంవత్సరం పరీక్షలు వాయిదా పడ్డాయని సహాయ సంచాలకుడు డాక్టర్‌ ఎం.అజంతకుమార్‌ తెలిపారు. వర్షాల కారణంగా సెప్టెంబరు 28, 29 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన పరీక్షలు యథావిధిగా జరుగుతాయని, విద్యార్థులు గమనించాలని ఆయన సూచించారు.

Posted Date : 28-09-2021