• facebook
  • whatsapp
  • telegram

KU Exams: కేయూ పరీక్షలు వాయిదా

ఎన్జీవోస్‌కాలనీ, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో సెప్టెంబరు 28న జరిగే డిగ్రీ, బీటెక్, ఎల్‌ఎల్‌బీ, అయిదేళ్ల కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ  పరీక్షలను వాయిదా వేసినట్లు వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి.మల్లారెడ్డి, అదనపు అధికారులు డా.వై.వెంకయ్య, డా.పి.సదానందం సెప్టెంబరు 27న ఒక ప్రకటనలో తెలిపారు. గులాబ్‌ తుపాను నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వాయిదా పడిన పరీక్షలు తిరిగి నిర్వహించే తేదీలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. విద్యార్థులు గమనించాలని అధికారులు సూచించారు.

Posted Date : 28-09-2021