• facebook
  • whatsapp
  • telegram

AP Job Notifications: ఉద్యోగాల భర్తీకి 4 నోటిఫికేషన్ల విడుదల

మొత్తం 71 పోస్టులు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాల భర్తీకి 4 నోటిఫికేషన్లను సెప్టెంబ‌రు 28న‌ జారీ చేసింది. 39 హార్టికల్చర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి అక్టోబరు 11 నుంచి నవంబరు 2 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది. 24 లెక్చరర్స్‌/అసిస్టెంట్‌ హోమియో ప్రొఫెసర్, 3 లెక్చరర్స్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను అక్టోబరు 7 నుంచి 28వ తేదీ మధ్య పంపుకోవాలని పేర్కొంది. అలాగే.. 5 తెలుగు రిపోర్టర్ల పోస్టుల భర్తీకి అక్టోబరు 18 నుంచి నవంబరు 8 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించింది. పూర్తి వివరాలు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉన్నట్లు తెలిపింది.

ఏపీపీఎస్సీ - ఆయుష్‌లో 27 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

ఏపీపీఎస్సీ - 05 తెలుగు రిపోర్టర్‌ పోస్టులు 

 ఏపీపీఎస్సీ - 39 హార్టికల్చర్‌ ఆఫీసర్లు 

ఏపీపీఎస్సీ - 04 డీపీఆర్‌ఓ పోస్టులు

ఏపీపీఎస్సీ - 06 అసిస్టెంట్ డైరెక్టర్‌ పోస్టులు 

Posted Date : 29-09-2021