• facebook
  • whatsapp
  • telegram

పీసెట్‌ ఫలితాల విడుదల  

 

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: వ్యాయామ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సెప్టెంబరు 24 నుంచి 27 వరకు నిర్వహించిన పీసెట్‌ ఎంపికల ఫలితాలను సెప్టెంబరు 29న రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ఆచార్య రామ్మోహన్‌రావు విడుదల చేశారు. మొత్తం 1857 మంది దరఖాస్తు చేసుకోగా 1457 మంది పాల్గొన్నారు. వీరిలో 1424 మంది (97.74 శాతం) ఉత్తీర్ణత సాధించారు.

Posted Date : 29-09-2021