• facebook
  • whatsapp
  • telegram

ఉద్యోగాలకు సిద్ధంగా పాలిటెక్నిక్‌ విద్యార్థులు

* అక్టోబరు ఒకటి నుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ 

* సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌

ఈనాడు, అమరావతి: పాలిటెక్నిక్‌ విద్యార్థులకు నైపుణ్యాలు అందించడం ద్వారా ఉద్యోగాలకు సిద్ధంగా ఉండేలా తయారు చేస్తామని సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్‌ పోలా భాస్కర్‌ అన్నారు. పాలిటెక్నిక్‌లను పరిశ్రమలతో అనుసంధానం చేయనున్నామని, విద్యార్థులకు మూడో ఏడాదిలో సాఫ్ట్‌ నైపుణ్యాలు అందించనున్నామని వెల్లడించారు. పరిశ్రమల్లో మధ్యస్థాయి సూపర్‌వైజర్‌ ఉద్యోగాలకు ఎక్కువ అవకాశాలున్నాయని, పరిశ్రమలకు కళాశాలలను అనుసంధానం చేయడంతో పని అనుభవం వస్తుందని తెలిపారు. పాలిసెట్‌ ప్రవేశాల ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 84 ప్రభుత్వ, 173 ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలల్లో మొత్తం 70,427 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పాలిసెట్‌కు 68,137మంది అభ్యర్థులు హాజరుకాగా.. 64,187 మంది అర్హత సాధించారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల కోసం 31 పాలిటెక్నిక్‌ల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించి ఏమైన సందేహాలు ఉంటే ఫోన్‌ నంబర్లు 8106876345, 8106575234, 7995865456లో సంప్రదించవచ్చని సూచించారు.

 

షెడ్యూల్‌ ఇలా..

* ఆన్‌లైన్‌ ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు: అక్టోబరు 1-6

* సహాయ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన: అక్టోబరు 3-7

* కళాశాలలు, కోర్సుల ఎంపికకు ఐచ్ఛికాలు: 3-8

* ఐచ్ఛికాల మార్పు: 9

* సీట్ల కేటాయింపు: 11 

* కళాశాలల్లో చేరిక: 12-18

* తరగతులు ప్రారంభం: 18

Posted Date : 29-09-2021