• facebook
  • whatsapp
  • telegram

AGRICET: అగ్రిసెట్‌ కౌన్సెలింగ్‌ 11వ తేదీకి వాయిదా

 

గుంటూరు(జిల్లాపరిషత్‌), న్యూస్‌టుడే: ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రిసెట్‌-2021 అభ్యర్థులకు వ్యవసాయ బీఎస్సీ (హానర్స్‌) కోర్సులో ప్రవేశాలు కల్పించేందుకు అక్టోబరు 8న ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్‌ను 11వ తేదీకి వాయిదా వేసినట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ గిరిధర కృష్ణ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్‌ని ముందుగానే నిర్వహిస్తుండటంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో దీనిని వాయిదా వేశామన్నారు. 11వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుందన్నారు. ఇతర వివరాలకు www.angrau.ac.in  వెబ్‌సైట్‌ని చూడాలని కోరారు.

Posted Date : 02-10-2021