• facebook
  • whatsapp
  • telegram

Inter classes: హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌ కళాశాలలో ఇంటర్‌ తరగతుల నిలిపివేత

 

విశాఖ: విశాఖలోని హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌ కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం తరగతులను అధికారులు నిలిపేశారు. ఈ మేరకు షిప్‌యార్డు కళాశాల విద్యార్థులకు సమాచారం అందించింది. అర్ధాంతరంగా తరగతులు నిలిపేయడంతో విద్యార్థులు విలపిస్తున్నారు. 2021-22 ఏడాదికి గాను ఈ కళాశాల 200 మందికి ప్రవేశాలు కల్పించింది. కళాశాల తాజా ప్రకటనతో విద్యార్థుల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారిందని తల్లిదండ్రులు వాపోతున్నారు.  

Posted Date : 04-10-2021