• facebook
  • whatsapp
  • telegram

Microsoft: ఏపీలో 1.62 లక్షల మంది విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ ఉచిత శిక్ష‌ణ‌

ఈనాడు, అమరావతి: ఏపీలో 1.62 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం.. మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఆధ్వర్యంలో 40 రకాల కోర్సులపై ఉచిత శిక్షణ అందించనుంది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నాయి. ఐటీఐ, ఇంజినీరింగ్, సాధారణ డిగ్రీ తదితర 400 విద్యా సంస్థలను ఎంపికచేసి, అక్కడి విద్యార్థులకు ఈ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. 6 నెలల నుంచి ఏడాది పాటు ఉండే ఈ శిక్షణను కొన్ని కోర్సులకు ఆన్‌లైన్‌లో, మరికొన్నింటికి ఆఫ్‌లైన్‌లో అందిస్తారు. చివర్లో మైక్రోసాఫ్ట్‌ నిర్వహించే పరీక్షలో అర్హత సాధిస్తే సర్టిఫికేషన్‌ లభిస్తుంది. కళాశాలలు, విద్యార్థుల ఎంపిక, శిక్షణ నిర్వహణపై ప్రభుత్వం మంత్రులు ఆదిమూలపు సురేష్, గౌతమ్‌రెడ్డితో పాటు 9 మంది సభ్యులతో కమిటీ నియమించింది.

 

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ క్లౌడ్ కంప్యూటింగ్ 

‣ పచ్చని భవితకు... పర్యావరణ కోర్సులు

‣ ట్రిపుల్‌ఐటీలో మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సు ప్రారంభం

‣ కాగ్‌లో 199 స్పోర్ట్స్‌ కోటా పోస్టులు

Posted Date : 05-10-2021