• facebook
  • whatsapp
  • telegram

Supreme Court: ఆ కోటా కోసం కసరత్తు చేస్తున్నారా?: సుప్రీం

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతులపై కేంద్రానికి ప్రశ్న
దిల్లీ: ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో కోటా మంజూరు చేస్తూ తీసుకున్న నిర్ణయాలను సమర్థించుకునే దిశగా ఎలాంటి కసరత్తు చేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అక్టోబరు 5న ప్రశ్నించింది. ‘‘ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సంబంధించి ప్రత్యేకించి ఓ క్యాడర్‌లో పదోన్నతులకు కోటా ఇవ్వడంపై న్యాయపరంగా సవాల్‌ చేస్తే.. కేంద్రం తన నిర్ణయాలను సమర్ధించుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రత్యేకించిన క్యాడర్‌లో తగినంతగా వారి ప్రాతినిధ్యం లేదని, అలాగే ఈ కోటా వల్ల స్థూలంగా పాలన సమర్థతపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని తేల్చిచెప్పాలి. సిద్ధాంతాలపై వాదనలు చేయొద్దు. మాకు డేటా చూపించండి’’ అని జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు నేతృత్వంలోని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రానికి స్పష్టం చేసింది. అంతకుముందు కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ వాదనలు వినిపించారు. దీనిపై అక్టోబరు 6న కూడా విచారణ కొనసాగనుంది.

Posted Date : 06-10-2021