• facebook
  • whatsapp
  • telegram

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగు విద్యార్థులకు గరిష్ఠ మార్కులు 331?

ప్రాథమిక కీని విడుదల చేసిన ఐఐటీ ఖరగ్‌పుర్‌

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు అత్యధికంగా 360కి 331 మార్కులు వస్తాయని ప్రాథమిక కీ ప్రకారం తెలుస్తోంది. అక్టోబ‌రు 3వ తేదీన అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జరగగా.. అక్టోబ‌రు 10న‌ ప్రాథమిక కీని ఐఐటీ ఖరగ్‌పుర్‌ విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలను అక్టోబ‌రు 11వ తేదీలోపు పంపాలని సూచించింది. ప్రాథమిక కీ ప్రకారం శిక్షణ సంస్థలు, కళాశాలలు తమ విద్యార్థులకు వచ్చే మార్కులు, ర్యాంకులపై అంచనా వేస్తున్నాయి. నలుగురికి మొదటి 10 ర్యాంకుల్లో స్థానం దక్కుతుందని, అందులో ముగ్గురు ఏపీ విద్యార్థులుంటారని సమాచారం. మొదటి 100 ర్యాంకుల్లోపు ఏపీ, తెలంగాణల నుంచి కనీసం 35 మంది ఉంటారని ఆయా సంస్థలు చెబుతున్నాయి. అక్టోబ‌రు 15న ర్యాంకులను వెల్లడించనున్నారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ జేఈఈ మెయిన్‌ బీఆర్క్‌లో నారాయణ విద్యార్థికి జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు

‣ ఎస్‌బీఐ ఆర్‌సెటీలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

నగరాలు ఆరోగ్య పెన్నిధులుగా...

విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాలు - సౌరకుటుంబం

‣ ఇండియ‌న్ ఆర్మీ-ఎన్‌సీసీ స్పెష‌ల్ ఎంట్రీ  కోర్సు

Posted Date : 11-10-2021