• facebook
  • whatsapp
  • telegram

JEE: జోసా కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

తాడేపల్లిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: దేశంలోని ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు జోసా (జాయింట్ సీట్ అలకేషన్‌) కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిందని ఏపీ నిట్‌ తాడేపల్లిగూడెం డైరెక్టర్‌ సీఎస్పీ రావు అక్టోబ‌రు 13న‌ తెలిపారు. అక్టోబ‌రు 16 నుంచి 25 వరకూ అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చన్నారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆరు విడతల్లో పూర్తవుతుందన్నారు. మొదటి విడత సీట్లను అక్టోబ‌రు 27న, ఆరో విడత సీట్లు నవంబరు 18న కేటాయిస్తుందన్నారు. బీటెక్‌ ప్రథమ సంవత్సరంలో గతేడాది 603 సీట్లు ఉండగా ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద ఈ విద్యా సంవత్సరం నుంచి 150 సీట్లు అదనంగా పెరగటంతో వాటి సంఖ్య 753కి చేరిందని వివరించారు.

 

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

 మెయిన్స్‌ తెలుగులో.. మేలెంత?

 సన్నద్ధతకు ఏది సరైన సమయం?

పారుబాకీలను కరిగించే వ్యూహం

‣ మీ పిల్లల విద్యా సామర్థ్యం ఎంత?  

డ్రాగన్‌ కలల ప్రాజెక్టుకు చిక్కులు

Posted Date : 14-10-2021