ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: సీనియర్ ఇంటర్ ఎంపీసీ విద్యార్థులకు జూన్‌లో జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ క్రమంలో వారికి అవగాహన కల్పించేందుకు ఎస్ఐఎఫ్ నేతృత్వంలో జేఈఈ మెయిన్ మోడల్ పరీక్షలను నగరంతో పాటు పలు చోట్ల ఏప్రిల్ 11న నిర్వహించారు. మంగళవారం కొనసాగనుంది. తొలుత ఆయా పరీక్షా పత్రాలను నగరంలోని కలెక్టరేట్లో కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షపై విద్యార్థులకు అవగాహన కల్పించడం మంచి పరిణామమని అభినందించారు. ఒత్తిడితో కూడిన చదువులు వద్దని విజ్ఞప్తి చేశారు. సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సోమేశ్వరరావు, సి.హెచ్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఎంసెట్, నీట్‌లకు గత 20 ఏళ్లుగా మోడల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ శ్రీవాస్ నుపూర్ అజయ్‌కుమార్, డీఆర్వో కె.మోహన్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ చంద్రలీల, ఎస్.ఎఫ్.ఐ. నగర నాయకుడు భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.
‣ Read Latest job news, Career news, Education news and Telugu news
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat and Google News
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.