• facebook
  • whatsapp
  • telegram

Higher Education: జాతీయ ఉన్నత విద్య అర్హతల ఫ్రేమ్‌వర్క్‌ ఖరారు

ఈనాడు, అమరావతి: ఉన్నత విద్యలో పాఠ్యాంశాలు, బోధనాశాస్త్రం, మూల్యాంకనంలో స్థిరత్వాన్ని తీసుకొచ్చేందుకు జాతీయ ఉన్నత విద్య అర్హతల ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌హెచ్‌ఈక్యూఎఫ్‌)లో యూజీసీ మార్పులు చేసింది. నూతన విద్యా విధానంలో పేర్కొన్న బహుళ విభాగ విద్య, బహుళ ప్రవేశం, నిష్క్రమణ, వృత్తి విద్యలాంటి సంస్కరణలను అమలు చేసేందుకు ఎన్‌హెచ్‌ఈక్యూఎఫ్‌ను సవరించింది. అభ్యర్థికి ప్రదానం చేసే సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ వంటి అర్హతల్లో పాటించాల్సిన విధానాలను ఇందులో పేర్కొంది. స్థాయి(లెవల్‌) 5 నుంచి 10 వరకు మొదట ప్రతిపాదించగా... దీన్నిప్పుడు స్థాయి-8కి కుదించారు. నేషనల్‌ స్కూల్‌ క్వాలిఫికేషన్‌ ఫ్రేమ్‌ వర్క్, నేషనల్‌ స్కిల్‌ క్వాలిఫికేషన్‌ ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా దీన్ని మార్పు చేశారు. స్థాయి-4.5 పూర్తి చేస్తే యూజీ సర్టిఫికెట్‌ ఇస్తారు. స్థాయి-5.5 బ్యాచిలర్‌ డిగ్రీ, స్థాయి-6 నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్‌కు సమానం. స్థాయి-8 పూర్తి చేస్తే పీహెచ్‌డీతో సమానం. ఈ స్థాయి కోర్సులను పూర్తిచేస్తే వాటి ఆధారంగా క్రెడిట్లు ఇస్తారు. స్థాయి-4.5కు 40 క్రెడిట్లు, స్థాయి-7 పూర్తి చేస్తే 80 క్రెడిట్లు ఇస్తారు. ఈ మార్పుపై వర్సిటీల ఉపకులపతులు, కళాశాలల ప్రిన్సిపాళ్లలో ఈనెల 25న యూజీసీ వర్చువల్‌ సమావేశం నిర్వహించనుంది. 

8 గురుకులాల్లో ఐఐటీ, జేఈఈ, నీట్‌కు శిక్షణ 

రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది అంబేడ్కర్‌ గురుకులాల్లోని ఎస్సీ విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్‌లకు ఉచిత శిక్షణను సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున సోమవారం వర్చ్యువల్‌ విధానంలో ప్రారంభించారు. బాలికలకు మధురవాడ, ఈడ్పుగల్లు, సింగరాయకొండ, చిన్నచౌక్‌లోని గురుకులాల్లో, బాలురకు కొత్తూరు, చిల్లకూరు, అడవితక్కెళ్లపాడు, చిన్నటేకూరు గురుకులాల్లో శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించారు. ఇప్పటివరకు మూడు కేంద్రాల్లోనే శిక్షణ ఇస్తుండగా ఈ ఏడాది దాన్ని ఎనిమిదింటికి పెంచినట్లు మంత్రి వివరించారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఐఐఎస్‌ఎస్‌టీలో పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాములు 

‣ జల సంరక్షణకు జన భాగస్వామ్యం 

‣ షిప్పింగ్‌ కోర్సుల్లో చేరతారా?

‣ డీఏ-ఐఐసీటీలో యూజీ, పీజీ ప్రోగ్రాములు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.