• facebook
  • whatsapp
  • telegram

Gurukul Admissions: గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

విస్సన్నపేట, న్యూస్‌టుడే: కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని గిరిజన సంక్షేమశాఖ గురుకుల పాఠశాలల్లో 3వ తరగతిలో ప్రవేశాలు, 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు బ్యాక్‌లాగ్‌ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎన్టీఆర్‌ జిల్లా గిరిజన సంక్షేమశాఖాధికారి ఎం.రుక్మాంగదయ్య ఒక ప్రకటనలో తెలిపారు. జగ్గయ్యపేట, ఉయ్యూరులో బాలురకు, కొండపల్లి, మైలవరం పాఠశాలల్లో బాలికలకు 40 మంది చొప్పున ప్రవేశ పరీక్ష లేకుండా 3వ తరగతిలో ప్రవేశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. విస్సన్నపేటలో బాలురకు, నందిగామలో బాలికలకు 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మిగులు సీట్ల భర్తీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు సమీపంలోని గిరిజన గురుకుల పాఠశాలల్లో సంప్రదించి, దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

 ముసాయిదా మొదలు... ఆమోద‌ ముద్ర వ‌రకు! 

 జ్ఞాపకశక్తీ... ఏకాగ్రతా పెర‌గాలంటే?

 రెండు డిగ్రీలతో రెట్టింపు లాభం!

‣ ఉచిత యాప్‌లతో చదివేసుకోండి!

 డైవ్‌.. కెరియర్‌ వావ్‌!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.